In a unique devotional initiative, the Tirumala Tirupati Devasthanams (TTD) has announced a special program for newly married couples. Under this initiative, couples who send their wedding invitation card to TTD will receive the sacred blessings of Lord Venkateswara directly at their homes.
As part of this program, TTD will send a divine blessing kit containing Akshintalu (talambralu), kumkum, kankanam (sacred thread), a Sri Venkateswara Asirvachana Patram, and the book “Kalyana Samskruti”, which explains the spiritual and cultural importance of marriage.
The Executive Officer,
Tirumala Tirupati Devasthanams (TTD),
TTD Administrative Buildings, K.T. Road,
Tirupati – 517501, Andhra Pradesh
0877-2233333
0877-2277777
TTD officials stated that this initiative is aimed at ensuring that newlyweds, regardless of their location, can begin their marital journey with the divine blessings of Lord Venkateswara. Devotees are encouraged to take advantage of this special service offered by TTD.
నూతన వధూవరులకు టీటీడీ శుభవార్త: వివాహ ఆహ్వాన పత్రిక పంపితే స్వామివారి ఆశీస్సులు ఇంటికే
తిరుపతి:
వివాహ బంధంలోకి అడుగుపెడుతున్న నూతన వధూవరులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శుభవార్త తెలిపింది. టీటీడీ వినూత్న కార్యక్రమంలో భాగంగా, నూతనంగా వివాహం చేసుకునే జంటలు తమ వివాహ ఆహ్వాన పత్రికను పంపితే, శ్రీ వేంకటేశ్వర స్వామివారి పవిత్ర ఆశీస్సులను నేరుగా వారి ఇంటికే పంపించే ఏర్పాట్లు చేసింది.
ఈ కార్యక్రమం ద్వారా వధూవరులకు సంప్రదాయబద్ధమైన పూజా సామగ్రిని టీటీడీ అందజేస్తోంది. ఇందులో అక్షింతలు (తలంబ్రాలు), కుంకుమ, కంకణం, శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆశీర్వచన పత్రికతో పాటు ‘కళ్యాణ సంస్కృతి’ అనే ప్రత్యేక పుస్తకాన్ని పంపిస్తున్నారు. ఇది వివాహ సంస్కారాల ప్రాధాన్యతను తెలియజేసే విధంగా రూపొందించబడినదిగా టీటీడీ అధికారులు తెలిపారు.
టీటీడీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, నూతన వధూవరులు తమ వివాహ ఆహ్వాన పత్రికను టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చిరునామాకు పంపించాల్సి ఉంటుంది. చిరునామా వివరాలు పోస్టర్‌లో పేర్కొనబడినట్లు తెలిపారు. దేశంలో ఎక్కడ ఉన్నా స్వామివారి ఆశీస్సులు అందేలా ఈ కార్యక్రమం రూపొందించబడిందని చెప్పారు.
ఇంకా సమాచారం కోసం 0877-2233333 లేదా 0877-2277777 నంబర్లను సంప్రదించాలని టీటీడీ సూచించింది. ఈ సేవను భక్తులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.
